1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (15:32 IST)

బావపై రంగు అనుకుని టర్పెంటాయిల్ చల్లేసిన మరదలు-పొయ్యి పక్కనే నిల్చోవడంతో బావ మృతి..

సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. అయితే రంగు అనుకున్న నీళ్లు టర్పెంటాయిల్ అని తెలియక బావను పొట్టనబెట్టుకున్నానని ఆ మరదలు కుమిలిపోయింది.

సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. అయితే రంగు అనుకున్న నీళ్లు టర్పెంటాయిల్ అని తెలియక బావను పొట్టనబెట్టుకున్నానని ఆ మరదలు కుమిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం దేవుని తండాకు చెందిన చందర్ నాయక్ (24) అలియాస్ చందు.. సింగరేణి కాలనీలోని అతని సోదరుని ఇంట వుంటున్నాడు. 
 
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల హోలీ పండుగ నాడు వరుసకు మరదలయ్యే బాలిక(15)తో హోలీ ఆడాడు. ఇద్దరూ రంగులు చల్లుకుంటున్న సమయంలో ఓ సీసాలోని రంగు నీటిని బావపై ఆ బాలిక చల్లింది.
 
అయితే బాలిక చల్లింది టర్పెంటాయిల్ కావడం.. ఆ సమయంలో చందర్ నాయక్ పొయ్యి పక్కన్నే నిలుచుని ఉండటంతో అతనికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చందును ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చందు ప్రాణాలు కోల్పోయాడు.