శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (18:21 IST)

మద్యంమత్తులో డ్రైవింగ్ - ఘోర ప్రమాదం : కెనడా ఎంటెక్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. కొండాపూర్ మైహోమ్ మంగ‌ళ వ‌ద్ద కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ కారులో ప్ర‌యాణిస్తున్న ఓ యువ‌తి ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 
 
వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అయితే మ‌ద్యం మ‌త్తులో కారు న‌డ‌ప‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. కారు న‌డిపిన వ్య‌క్తిని అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. మృతురాలు ఆశ్రిత కెన‌డాలో ఎంటెక్ చ‌దువుతున్న‌ట్లు తెలిసింది.