బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:19 IST)

తాగి వాహనం నడుపుతున్న 42 మందిపై కేసులు

హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలలో నిన్న అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపుతున్న 42 మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న పలువురి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి వివిధ ప్రాంతాలలో రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 42 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

20 కార్లు, 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు మహిళలు ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హజరుపరచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.