శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 16 నవంబరు 2018 (21:04 IST)

నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబు ఫోటో... తాతా ఎన్టీఆర్ స్ఫూర్తితో వస్తున్నా...

సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్‌ వేయనున్నారు. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు ఆమె మాట్లాడారు. నా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించి తాత ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణ, మావయ్య చంద్రబాబుల స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. 
 
తనపై నమ్మకంతో టికెట్‌ ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని నా చిన్ననాటి ఆశయమని తాత ఎన్టీఆర్, హరికృష్ణను రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ కుటుంబం నుంచి అందరి ఆమోగ్యంతోనే తాను పోటీచేస్తున్నానని చంద్రబాబు ఆశీస్సులతో ప్రజల్లోకి వెళ్తానని తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి కష్టాలనైనా ఎదురుకుంటానన్నారు సుహాసిని.
 
అయితే చంద్రబాబును సుహాసిని కలిసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో నందమూరి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.