మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: గురువారం, 10 సెప్టెంబరు 2020 (19:55 IST)

ఉష్ణోగ్రతలో మార్పు, హైదరాబాదులో భారీ వర్షం

గత కొద్ది రోజులుగా వర్షాలు పడకపోవడంతో నగరాల్లో భారీగా ఉష్ణోగ్రత పెరిగింది. దీంతో నగర ప్రజలంతా కొద్దిరోజుల నుంచి ఉక్కపోతకు గురై అతలాకుతలం అవుతున్నారు. అయితే హైదరాబాదు నగరంలో గురువారం ఉదయం వరకు వేడివేడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి చల్లబడిపోయింది.
 
ఆకస్మికంగా వాతావరణంలో మార్పులు వచ్చి వేడి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా భారీ వర్షాలు కురిశాయి. దీంతో హైదరాబాదు నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి గురువారం మధ్యాహ్నం నుంచి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. 
 
నగరంలోని ఖైరతాబాద్, ఎల్బీనగర్, హయత్ నగర్, సంతోష్ నగర్, చంపాపేట్, అంబర్ పేట్, రాంనగర్, తార్నాక, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాలలో భారీవర్షం కురిసింది.