1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 1 ఆగస్టు 2017 (07:07 IST)

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.. డ్రగ్స్ కథ కంచికి.. అంతా సాక్షులే..

దాదాపు 15 రోజులపాటు చిత్రసీమలోని ప్రముఖులను వణికించి గంటల తరబడి విచారణ తంతు నడిపిన ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు డ్రగ్స్ వాడకం, వినియోగం, సరఫరా కేసులో కీలక ఆపరేషన్ ముగించారు. కొండను తవ్వి ఎలుకునైనా పట్టారో లేదో తెలీదు కానీ ఇంతవరకు అరెస్టు చేసిన కెల్విన్

దాదాపు 15 రోజులపాటు చిత్రసీమలోని ప్రముఖులను వణికించి గంటల తరబడి విచారణ తంతు నడిపిన ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు డ్రగ్స్ వాడకం, వినియోగం, సరఫరా కేసులో కీలక ఆపరేషన్ ముగించారు. కొండను తవ్వి ఎలుకనైనా పట్టారో లేదో తెలీదు కానీ ఇంతవరకు అరెస్టు చేసిన కెల్విన్, జీశాన్, మైక్ కమింగాలతో పాటు మరో 17 మందిపై చార్జీషీటు వేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. విద్యార్థులే కాకుండా సినీరంగంలో ప్రొడ్యూసర్లు, దర్శకులు, హీరోలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారని ఆరోపించి రోజుల తరబడి విచారణ పేరుతో సినిమా వాళ్లకే సినిమా చూపించి తంతును ముగించారు. 
 
12 మంది సినీ ప్రముఖులు, 17 మంది ఇతర రంగాలకు చెందిన వారిని ఏకంగా 13 నుంచి 14 గంటల పాటు విచారించిన సిట్‌ ఏం తేల్చిందన్న అంశంపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకే క్లారిటీ లేకుండా పోయింది. కెల్విన్, జీశాన్, కమింగతోపాటు డ్రగ్స్‌ రాకెట్‌లో పైస్థాయిలో ఉన్న లింకులను సిట్‌ అధికారులు ఛేదించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
సమాజంలో డ్రగ్స్‌ వాడకంపై భయాన్ని సృష్టించేందుకు సినీ ప్రముఖులను పావులుగా వాడుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. కేవలం 12 మంది మాత్రమే కాకుండా మరో 15 మంది ప్రముఖులు కూడా ఉన్నారని పదేపదే చెప్పిన వచ్చిన సిట్‌ అధికారులు వారికి నోటీసులు కూడా జారీ చేయలేదు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లోనూ డ్రగ్స్‌ దందా సాగుతోందని చెప్పినా.. ఆ దిశగా ఎందుకు విచారణ చేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
ప్రస్తుతం తమకు అప్పగించిన టాస్క్‌ ముగిసిందని సిట్‌ అధికారి ఒకరు సాక్షితో అన్నారు. ఇప్పటివరకు 29 మందిని విచారించామని, రెండో జాబితా ఉంటుందో లేదో తాను చెప్పలేనని, ప్రస్తుతానికి అలాంటి కార్యచరణ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు చార్జిషీట్‌ దాఖలుకు సంబంధించిన కార్యక్రమం మొదలుపెట్టాల్సి ఉందని, అంతవరకే తమ పని అని స్పష్టంచేశారు. అటు బాధితులు కాకుండా, ఇటు నిందితులు కాకుండా సాక్ష్యులుగా కేసులో 29 మందిని పేర్కొనే అవకాశం ఉంది. అయితే సాక్ష్యులను గంటల కొద్ది ప్రశ్నించడంపై భవిష్యత్‌లో న్యాయపరంగా సిట్‌కు సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న 12 మంది సినీ ప్రముఖులతోపాటు ఇతర రంగాలకు చెందిన 17 మంది బాధితులా లేదా సాక్ష్యులా అన్న అంశంపై సిట్‌ క్లారిటీ ఇవ్వలేకపోతోంది. ఒకవేళ సినీ ప్రముఖులు డ్రగ్స్‌ వాడినట్టు భావిస్తే వారంతా బాధితులవుతారని స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలా కాకుండా డ్రగ్స్‌ దందా చేసి ఉంటే నిందితులుగా మారతారు.

కానీ సిట్‌ 12 మందిలో ఒక్కరిని కూడా నిందితులుగా చూపలేకపోయింది.  సిట్ వేశారు. దీంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ పనిపడతారు అనుకున్న జనాలకు ఇక శఠగోపం పెట్టినట్లే. రాజకీయనేతలూ, చిత్రసీమ ప్రముఖులూ ఎక్కడ రాజీపడాలో అక్కడ రాజీపడిపోయి కేసు చంకనాకిపోయేలా చేశారని కూడా అనుమానాలు వస్తున్నాయి.