గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Updated :హైదరాబద్ , గురువారం, 27 జులై 2017 (02:38 IST)

చార్మితో పెట్టుకుంటాడా.. ఆ పోలీసుకు దిమ్మ తిరిగింది

సిట్‌ విచారణకు హాజరయ్యేందుకు ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చిన చార్మికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె విచారణకు వస్తున్నారని తెలిసి సిట్‌ అధికారులు మహిళ ఇన్‌స్పెక్టర్‌తో పాటు కొందరు మహిళ కానిస్టేబుళ్లను బందోబస

సిట్‌ విచారణకు హాజరయ్యేందుకు ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చిన చార్మికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె విచారణకు వస్తున్నారని తెలిసి సిట్‌ అధికారులు మహిళ ఇన్‌స్పెక్టర్‌తో పాటు కొందరు మహిళ కానిస్టేబుళ్లను బందోబస్తులో పెట్టారు. అయితే చార్మి కారు దిగి లోపలికి వెళ్తున్న సందర్భంగా నల్లగొండ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ అతిగా ప్రవర్తించాడు. మహిళ సిబ్బంది ఉన్నా వారిని పక్కను తప్పించి చార్మిని తాకుతూ ముందుకు తీసుకెళ్లాడు. దీంతో చార్మి షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంపై సిట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎక్సైజ్‌ శాఖ విచారణకు ఆదేశించింది. సంబంధిత కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
 
ఈ అపశ్రుతి మినహాయిస్తే బుధవారం సిట్ విచారణ చాలా స్మూత్‌గా సాగిపోయింది. సిట్ మహిళా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడబాటులేకుండా చార్మి కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసులో భాగంగా బుధవారం చార్మి సిట్‌ ముందుకు వచ్చారు. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్న ఆమెను సూపరింటెండెంట్‌ పవన్‌కుమార్‌ నేతృత్వంలోని ఇన్‌స్పెక్టర్లు బీఎల్‌ రేణుక, విజయలక్ష్మి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రావణిలతో కూడిన మహిళా అధికారుల బృందం విచారించింది. 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఆరు గంటలపాటు ప్రశ్నించింది. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సంబంధాలపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 
 
‘‘కెల్విన్‌ కాల్‌డేటాతో పాటు వాట్సాప్‌ మెసేంజర్‌లో అనేకసార్లు చార్మి దాదా అనే పేరుతో కాల్స్, మెసేజ్‌లున్నాయి. చార్మి దాదా పేరుతో ఉన్న ఫోన్‌ నంబర్‌ మీదేనా’’అని ప్రశ్నించగా... ఆ నంబర్‌ తనదేనని చార్మి అంగీకరించారు. అయితే తాను నిర్మిస్తున్న పలు సినిమాలకు కెల్విన్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేశాడని, అందువల్లే అతడితో వాట్సాప్‌ మెసేజ్‌లు, కాల్స్‌ ఉన్నట్టు చార్మి చెప్పినట్టు తెలిసింది. ‘మీరు పూరి జగన్నాథ్‌తో కలసి డ్రగ్స్‌ తీసుకున్నట్టు కెల్విన్‌ మా విచారణలో చెప్పాడు. దీనిపై ఏమంటారు’అని అధికారులు ప్రశ్నించగా.. తనకు డ్రగ్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని, కెల్విన్‌తో పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్‌ తీసుకున్నట్టు అనుమానించడం సరికాదని చార్మి స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.
 
జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్‌ రోజున జరిగిన పార్టీలో కెల్విన్, పూరి, చార్మి దిగిన ఫొటోలను చూపి ఈవెంట్‌ మేనేజర్‌తో ఇలా ఫొటోలు దిగడం వెనుకున్న ఆంతర్యం ఏంటని అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. సినిమా ఫంక్షన్‌ అన్న తర్వాత పార్టీలు సర్వసాధారణమని, ఫొటోలో ఉన్నది తానేనని, ఇలా అనేకసార్లు సినిమా ఫంక్షన్లలో అభిమానులతో ఫొటోలు దిగానని చార్మి చెప్పినట్టు సమాచారం.