Widgets Magazine

టికెట్ రాకపోతే మహిళ హారతి పళ్లాల్లో పెట్రోల్ పోయిస్తావా ఓదేలూ... ప్రాణాలు తీస్తావా?

గురువారం, 13 సెప్టెంబరు 2018 (20:09 IST)

అసెంబ్లీ సీటు రాలేదని నిరసన గళం వినిపిస్తున్న చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు యశోద ఆస్పత్రిలో ఊహించని ఘటన ఎదురైంది. ఇందారం బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఓదేలును బాధితుల బంధువులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నీకు టికెట్ రాకపోతే  కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటావా, ప్రాణాలు తీస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్ఘాంతపోయిన ఓదేలు చేసేదేమిలేక ఆసుపత్రి నుండి వెనుదిరిగారు. 
Telangana
 
బాల్క సుమన్‌కు చెన్నూర్‌ టీఆర్‌ఎస్‌ టికెట్టు కేటాయించడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి వచ్చిన బాల్క సుమన్‌‌కు మహిళలు హారతి పడుతున్నారు. అదే సమయంలో పెట్రోల్‌ సీసాతో వచ్చిన గట్టయ్య బాల్కసుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాడు. అక్కడ జనం గూమిగూడి ఉండటం చిన్న తొక్కిసలాడ జరిగి పెట్రోల్ మహిళల చేతుల్లోని హారతులపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురుకి గాయాలు అయ్యాయి. 
 
గాయపడ్డవారిని హైదరాబాద్ తరలించి యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓదేలు బాధితులు పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి రావడంతో బంధువుల ఘోరవ్ చేశారు. మరి తాజా ఈ ఘటన ఎటువైపునకు దారితీస్తుందో చూడాలి. నిరసనలు కాస్తా ఓదేలుకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేటట్టు ఉన్నాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తన భర్త మొదటి భార్య నాపై దాడి చేసింది.. దాసరి కోడలు ఫిర్యాదు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రఖ్యాత దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కోడలు దాసరి పద్మ ...

news

చంద్రబాబు మెడకు బాబ్లీ ప్రాజెక్టు ఉచ్చు... 2010 నాటి కేసులో నోటీసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కె. రోశయ్య ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా ...

news

జైట్లీజీ చేసిన ఘనకార్యం చాలు... ఇక తప్పుకోండి : రాహుల్

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చిక్కుల్లో పడ్డారు. దేశం విడిచి వెళ్లిపోయే ముందు తాను ...

news

ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్ ప్రారంభించిన సీఎం... ఇక రైతులకు అద్భుతాలే...

అమరావతి: సమాచార సాంకేతికత విప్లవం ఊతంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Widgets Magazine