శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (17:52 IST)

చికెన్ తినండి.. బర్డ్ ఫ్లూ రాదంటే రాదు.. డోంట్ వర్రీ: ఈటెల రాజేందర్

తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, మంత్రి టి. పద్మారావుతో పాటు పలువురు నేతలు సికింద్రాబాద్ లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్థ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. బర్డ్ ఫ్లూ భయమొద్దన్నారు. చికెన్ తింటే ఎలాంటి వ్యాధులూ రావని, ప్రజల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో వెన్‌కాబ్ చికెన్ సంస్ధ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో ఆయన పాల్గొన్నారు.చికెన్‌తో తయారు చేసిన వివిధ రకాల వంటకాలు, కోడిగుడ్లును స్ధానికులకు ఉచితంగా పంపిణీ చేశారు.
 
తదనంతరం ఈటెల మాట్లాడుతూ.. చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి వస్తుందని వదంతులు వస్తున్నాయని, అలాంటివి నమ్మవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ అండ్ ఎగ్ మేళాలను నిర్వహిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో కూడా చికెన్ వంటకాలనే తయారు చేపిస్తామని, దీనిని ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు.