శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:20 IST)

కోడి రేటు కొండెక్కి కూచుంది

తెలుగు రాష్ట్రాల్లో కోడికి రెక్కలొచ్చి కొండెక్కి కూర్చొంది. దీంతో ముక్క తినాలంటే బెంబేలెత్తిపోతున్నారు నాన్ వెజ్ ప్రియులు. రెండు రోజుల కిందట కిలో 180 రూపాయలు ఉన్న కోడి ధర ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి గరిష్టంగా రూ.240కు చేరింది.
 
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని జనం కోడి మాంసం, గుడ్డు వినియోగం పెంచారు. అయితే అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా అందనంతగా ధరలు పెరగడంతో వినియోగదారుల కోడి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటున్నారు అమ్మకందారులు.
 
ఇక ఆదివారం వస్తే మరో 20 నుండి 30 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. అటు కూరగాయలు రేటు కూడా ఆకాశాన్ని తాకడంతో ఇదేం కాలంరా బాబు ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదని వాపోతున్నారు.