మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (13:10 IST)

రేపటి నుండి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

కరోనా వైరస్ నివారణలో భాగంగా రేపటి నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు తెలిపారు. కోవిడ్ 19 వైరస్(కరోనా వైరస్) కారణంగా మార్చి 19 నుండి 25వ తేదివరకు ఆలయాన్ని మూసివేస్తున్నామని అన్నారు. 
 
అయితే ఈ వారం రోజులు.. స్వామి వారి ఆరాధన రోజు జరుగుతుంది కానీ భక్తులకు మాత్రం అనుమతి లేదని ఆయన అన్నారు. దేవాలయ అర్చకులు పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ ప్రధాన అర్చకుల ఆదేశాల మేరకు రేపటి నుండి ఆలయం మూసి ఉంటుందని చెప్పారు. 
 
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్టళ్లు మూసి వేయడం జరిగిందని,  వైరస్ ప్రభావం ఉన్నందున దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నామని అన్నారు.
 
ఈ నిర్ణయంపై దేవాలయానికి వచ్చే భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గుడికి చాలా మంది భక్తులు  వస్తారని అందువలన వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారన్నారు.