శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (20:41 IST)

సిస్టర్‌పై ఫాదర్ రాసలీలలు.. పెళ్లి పేరుతో లొంగదీసుకుని..?

చర్చికు దేవుడిని నమ్మి వచ్చిన సిస్టర్‌కు ఫాదర్ వల్లే మోసం జరిగింది. తాజాగా ఒక సిస్టర్‌ని పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఒక ఫాదర్ మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.
 
వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంట హోసన్నా చర్చిలో దారా నటానియేలు అనే వ్యక్తి ఫాదర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ చర్చిలోనే ఒక యువతి సిస్టర్‌గా దేవునికి సేవ చేస్తోంది. కానీ ఐదు నెలల క్రితం ఫాదర్ ఆ యువతిని పెళ్లి పేరిట లొంగదీసుకున్నాడు. 
 
అతని మాయమాటలు నమ్మిన యువతి, ఫాదర్‌తో కలిసి 5 నెలలు సహజీవనం చేసింది. ఆమెపై కామవాంఛ తీర్చుకున్న ఫాదర్, యువతి పెళ్లి ఊసు ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని అర్ధం చేసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.