శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (06:16 IST)

28 నుండి 'పార్కుల‌లో క్లీన్లీనెస్ డ్రైవ్': హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్

రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆదేశాల మేర‌కు ఈ నెల 28 నుండి సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు న‌గ‌రంలోని అన్ని పార్కుల‌లో వారంపాటు  క్లీన్లీనెస్ డ్రైవ్ చేప‌డుతున్న‌ట్లు జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

అదేవిధంగా ప్ర‌స్తుతం ఉన్న పార్కుల‌లో ఓపెన్ జిమ్‌లు, క్రీడా స‌దుపాయాలు, స్ట‌డీ రూం లు త‌దిత‌ర అంశాల‌ను నివేదించాల‌ని తెలిపారు.ఈ మేరకు  పార్కుల క్లీన్లీనెస్ డ్రైవ్ లో భాగంగా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, అర్భ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ డిప్యూటి డైరెక్ట‌ర్లకు ఉత్త‌ర్వులు జారీచేశారు.

ఈ డ్రైవ్‌లో కార్పొరేట‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని సూచించారు. ఈ నెల 28వ తేదీ గ్రీన్ ఫ్రైడే నుండి ఈ డ్రైవ్ చేప‌ట్టాల‌ని అధికారుల‌కు స్ప‌స్టం చేశారు.

క్లీన్లీనెస్ డ్రైవ్‌లో నిర్వ‌హించాల్సిన ప‌నుల వివ‌రాలు:
 
* అన్ని పార్కులు దాని ప‌రిస‌రాల్లో క్లీన్లీనెస్ డ్రైవ్ ప‌నుల‌ను చేప‌ట్టాలి.
* ప్ర‌హ‌రీగోడ‌కు గ్రీల్స్‌, ఫుట్ పాత్‌లు, టాయిలెట్స్ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించి అవ‌స‌ర‌మైన ప‌నుల‌కు వెంట‌నే మ‌రమ్మ‌తులు చేయించాలి.
* పిల్ల‌ల క్రీడా ప‌రిక‌రాలు, ఓపెన్ జిమ్‌ ప‌రిక‌రాల‌కు అవసరమైన  మ‌ర‌మ్మ‌తులు చేయించాలి.
* ఓపెన్ జిమ్‌లు, పిల్ల‌ల క్రీడా ప‌రిక‌రాలు, స్ట‌డీ ప్లేసెస్‌ల‌ను మెరుగుప‌ర్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను గుర్తించాలి .
* కాపలాదారులేని,  నిర్వ‌హ‌ణ లేని పాత ట్రీ పార్కుల‌ను ప‌రిశుభ్రం చేయాలి.
* కొత్త పార్కుల అభివృద్దికి అడ్డుగా ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాలి.
* జోన‌ల్, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, అర్భ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ డిప్యూటి డైరెక్ట‌ర్లు త‌మ ప‌రిధిలోని అన్ని పార్కుల‌ను త‌నిఖీ చేయాలి