1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (09:04 IST)

ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు తొలగిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్... శంకర్రావు

ట్యాంక్ బండ్ మీద వున్న విగ్రహాలలో కొన్నింటిని తొలగించే ఆలోచన వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు మండిపడ్డారు. ట్యాంక్ బండ్ పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సమంజసమైన విషయం కాదని, ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణకు చెందిన మహామనిషుల విగ్రహాలు పెట్టాలని సూచించారు.
 
కేసీఆర్ వ్యాఖ్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర విఘాతం కలుగుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఉన్న విగ్రహాలను తొలగించకుండానే తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీమాంధ్రకు చెందిన ప్రముఖుల విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం జరుగుతుందన్నారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. తెలుగువారి మధ్య విద్వేషాలు మంచిది కాదన్నారు.