గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:12 IST)

మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నేడు సీఎం కేసీఆర్ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్‌ ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక ఆయకట్టుకు నీటి సరఫరాతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ రిజర్వాయర్‌ కీలకం కానుంది. తక్కువ కాలంలోనే పూర్తి చేసిన ఈ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పంపుహౌస్‌ మోటార్లను సీఎం కేసీఆర్‌ ఆన్‌ చేయనున్నారు.
 
భారీ మట్టికట్టతో.. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ నిర్మించారు. వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు.