శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (08:15 IST)

తెలంగాణలో ముంచుకు వస్తున్న చలి

తెలంగాణవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. అదిలాబాద్‌లో మంగళవారం రాత్రి ఏకంగా 13.2 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత తగ్గింది. సోమవారం రాత్రి 15.5 డిగ్రీలు నమోదు కాగా.. ఒక్కరోజులోనే దాదాపు రెండు డిగ్రీలు తగ్గిపోయింది.

రాష్ట్రవ్యాప్తంగా 12 స్టేషన్లలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను వాతావరణ శాఖ నమోదు చేసింది. ఇందులో ఎనిమిది స్టేషన్లలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్, హన్మకొండ, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా  తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
 
రెండ్రోజుల్లో తేలికపాటి వర్షాలు 
నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండ్రోజుల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది.