శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: శనివారం, 9 డిశెంబరు 2017 (18:44 IST)

మహేష్‌ కత్తి అరెస్టుకు రంగం సిద్ధం...

ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌లపై సినీ విమర్శకుడు మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇద్దరు నేతలపై మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఫిర్యాదు చేశారు. ప్

ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌లపై సినీ విమర్శకుడు మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇద్దరు నేతలపై మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీని నరహంతకుడితో పోల్చడమే కాకుండా, వ్యక్తిగత దూషణలకు మహేష్‌ కత్తి దిగారని ఆన్‌లైన్‌లో పోలీసులకు బిజెపి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
 
ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు స్పందించారు. మహేష్ కత్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మహేష్ కత్తి మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. చట్టం గురించి తెలియని ఒక ఎమ్మెల్యే ఆన్‌లైన్‌లో నాపై ఫిర్యాదు చేశారు. నాకేమీ కాదు. ఎవరూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.