శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (16:55 IST)

కేవీపీ సంచలన వ్యాఖ్యలు.. ఒక అవినీతిపరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహమా..?

KVP
KVP
కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారని.. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద వస్తుందా..? అంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యుడి ప్రసంగాన్ని తొలగించడం దారుణమని.. ప్రపంచ చరిత్రలో ఇలాంటి పరిస్థితిని ఎక్కడా చూడలేదన్నారు. 
 
పార్లమెంట్‌లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలు పెట్టడంతో మోడీ ప్రభుత్వం తల్లక్రిందులైపోయిందన్నారు. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద వస్తుందా..? అంటూ అడిగారు. కోర్టు తీర్పు రాకుండా బహిష్కరణకు గురయ్యారని ఎలా చెబుతారన్నారు. రాహుల్ గాంధీని తక్షణమే ఖాళీ చేయాలనడం దుర్మార్గమన్నారు. ఈ దుర్మార్గాన్ని ఈ దేశపౌరులు ప్రశ్నించాలని సూచించారు.