గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (17:13 IST)

తెలంగాణ కాంగ్రెస్‌ MLAలు అరెస్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రశాంతం

Congress leaders
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు ఈ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపే ఉద్దేశంతో భారత్ బంద్‌ నిర్ణయం తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలతో పాటు బంద్‌కు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు తెల్లవారుజామునే డిపోల దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ 'భారత్ బంద్' పిలుపునకు కాంగ్రెస్ సహా 19 రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రత్యక్షంగా భారత్ బంద్‌లో పాల్గొననున్నట్లు స్పష్టం చేశాయి.
 
అయితే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం భారత్ బంద్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంకా రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్ర‌పు బ‌గ్గీపై అసెంబ్లీకి వ‌చ్చారు. కానీ అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్ర‌పు బ‌గ్గీని పోలీసులు అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్ నేతలకు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
భట్టిని రాంగోపాల్‌పేట పీఎస్‌కు తలించారు. గుర్రాలపై అసెంబ్లీ లోనికి వెళ్తామని పట్టుబట్టారు ఎమ్మెల్యేలు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటేనని., కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.