Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యేడాదికి ముందే సత్తా చూపిద్దాం... కేసీఆర్ వ్యూహం... గుత్తాతో రాజీనామా?

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (06:21 IST)

Widgets Magazine
gutta sukhender reddy

సార్వత్రిక ఎన్నికలకు ఒక యేడాది ముందు తమ సత్తా చాటేందుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు వ్యూహం రచించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించనున్నారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ ఎంపీగా గెలిచి తెరాసలో చేరిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ పదవికి గుత్తాతో రాజీనామా చేయించారు. తన రాజీనామా లేఖను ఈ నెల 14న పార్లమెంట్ స్పీకర్‌కు ఆయన అధికారికంగా అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఎంపీ పదవికి ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గెలవడం ద్వారా తమ పార్టీ సత్తా ఏంటో నిరూపించుకునే ఉద్దేశంలో తెరాస అధినేత కేసీఆర్ ఉన్నారని సమాచారం.
 
దీంతో నల్గొండ ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందుగానే తమ సత్తా చాటే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ ఉందని సమాచారం. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతలు వారి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుత్తా తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ ఉపఎన్నికలో తెరాస గెలవడం ద్వారా తాము బలంగా ఉన్నామనే విషయాన్ని అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి తెలియజెప్పాలని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెరాస వద్దంది.. బీజేపీ రమ్మంది... అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యంత కీలక నేతల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు. ...

news

పర్యాటక అవార్డులు, రివార్డులు ఆంధ్రప్రదేశ్‌కు సొంతం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. పర్యాటక అనుకూల ...

news

ఆయనే కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం... కోమటిరెడ్డి

తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో ...

news

17 ఏళ్ల బాలికకు బీర్ తాగించారు.. గంజాయి సిగరెట్ కాల్చమన్న తల్లిదండ్రులు (వీడియో)

బాలబాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న ...

Widgets Magazine