బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శనివారం, 5 సెప్టెంబరు 2020 (18:47 IST)

నీ భార్యకు కరోనా, రూ.29 లక్షలు ఫీజు పే చేయండి, డబ్బు కట్టగానే చనిపోయింది తీస్కెళ్లండి అన్నారు

కరోనా వైరస్‌తో హైదరాబాదులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో అసిస్టెంట్ ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిణి మృతి చెందారు. హైదరాబాదుకు చెందిన మాధవరెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి నిండు గర్భవతి కావడంతో గత కొద్ది రోజులుగా తనకు తీవ్ర జ్వరం రావడంతో మహబూబ్ నగర్ లోని హాస్పిటల్ నందు చేర్చారు. అక్కడ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా నమోదైంది.
 
ఐతే బాధితురాలు తీవ్ర ఇబ్బందులకు లోనుకావడంతో భార్యను మాధవ రెడ్డి అక్కడ నుండి హైదరాబాదులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా తెలిపారు. నిండు గర్భవతియైన శ్వేతా రెడ్డి పరిస్థితి విషమించడంతో వెంటనే ఐసియుకు తరలించారు. వైద్యులు చికిత్స నిమిత్తం బాధితురాలిని చూడటానికి ఎవరిని అనుమతించలేదు.
 
దీంతో అనుమానం చెందిన మాధవరెడ్డి తన సతీమణి గురించిన అన్ని రిపోర్టులను గరించి ఆరా తీసారు. చికిత్స జరుగుతుందని కాస్త పరిస్థితి విషమంగా ఉందని అంతవరకు ఎవ్వరు చూడటానికి అనుమతి లేదని తెలిపారు. చికిత్స కోసం 29 లక్షలు చెల్లించాలని తెలపడంతో మాధవరెడ్డి మొత్తం బిల్లును చెల్లించారు.
 
చికిత్స అనంతరం కొద్దిసేపట్లో శ్వేతా రెడ్డి మరణించినట్లు తెలపడంతో తీవ్ర వేదనకు గురైన మాదవరెడ్డి డబ్బు కోసం తన సతీమణికి సరైన చికిత్స అందించలేదని సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అన్యాయాలకు పాల్పడి డబ్బులు గుంజుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ పైన తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరియు కేటీఆర్‌కు పిర్యాదు చేశారు.