Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డేంజరస్ శ్రావణ్... నమ్మిన అమ్మాయిలను స్నేహితులకి పంచాలని చూసేవాడా?(వీడియో)

శనివారం, 17 జూన్ 2017 (20:57 IST)

Widgets Magazine

ఇతడో మోసగాడు. ఏమీ తెలియనట్లు గోళ్లు కొరుక్కుంటూ కనబడుతున్నాడు కానీ ఇతడి బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు. బ్యూటీషియన్ శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డిల ఆత్మహత్యలకు పరోక్షంగా కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కుంటూ అరెస్టయిన శ్రావణ్ మేక వన్నె పులి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇతడి వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే... ఇతడిది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామం. అక్కడ శ్రావణ్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. బాగా చేతిలో డబ్బు ఆడుతూ వుండటంతో జల్సారాయుడుగా గడుపుతుండేవాడు. అమ్మాయిలంటే మహా మోజు. 
sirisha-sravan
 
రాత్రయితే చాలు పబ్‌లు, పార్టీలంటూ తిరుగుతుంటాడు. అనుకుంటే అది జరగాల్సిందే. తను చేసేవి బయటకు తెలియకుండా వుండేందుకు పోలీస్ సర్కిల్‌తోనూ స్నేహం కొనసాగిస్తున్నాడు. తన పరిధిలో ఏ పోలీసు స్టేషనుకైనా ఎవరైనా కొత్తవారు వస్తే వెంటనే పరిచయాలు పెంచుకోవడం ఇతడి స్టైల్. అంతేకాదు... అడగకుండానే కానుకలు ఇస్తూ ఇతడు చేసే పనులకు అడ్డు లేకుండా చూసుకోవడం ఇతడి నైజం అనే ఆరోపణలున్నాయి. 
 
తనకు అవసరమైన పనులను చేసిపెట్టిన అధికారులకు ప్రతిఫలంగా బహుమానాలతోపాటు కొన్నిసార్లు అమ్మాయిలను కూడా సరఫరా చేసేవాడని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఎస్సై ప్రభాకర్ రెడ్డి కోసం ఒకటిరెండుసార్లు కాల్ గర్ల్స్ ను పంపినట్లు అతడు అంగీకరించాడు. ఈ అలవాటు చొప్పున శిరీషను కూడా అక్కడికి తీసుకెళ్లాడని తెలుస్తోంది. కానీ ప్లాన్ రివర్స్ కావడంతో అంతా తలకిందులై రెండు నిండు ప్రాణాలు బలవగా ఇతడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు... వీడియో చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'రచ్చబండ'కు అక్రమ సంబంధం... రోజా సమక్షంలో చర్చ...

అక్రమ సంబంధాలపై పోలీసు స్టేషనులో కేసులు పెట్టుకోవడం మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడవి ...

news

వివాహేతర సంబంధం.. రూ.2లక్షల డీల్.. భర్తను ప్రియుడితో కలిసి చంపించిన భార్య.. ఎక్కడ?

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేయించిన ...

news

తాజ్‌మహల్‌లోని మిస్టరీలు.. ముంతాజ్ మరణించాక షాజహాన్ ఆమె సోదరిని?

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ప్రేమకు గుర్తుగా పరిగణించబడుతోంది. మొఘల్ సామ్రాజ్యాధినేత ...

news

జేసీపై 6 విమానయాన సంస్థలు నిషేధం... జెంబో జెట్లో జేసీ హ్యాపీగా యూరప్‌కు...

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖపట్టణంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగులు తనను ...

Widgets Magazine