శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (08:47 IST)

దిశ ఎఫెక్ట్.. హైదరాబాద్ చివర్లో 4 పెట్రోలింగ్ వాహనాలు

దిశ ఘటన తర్వాత హైవేలపై భారీ  భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. హైవేలపై ఎప్పటి కప్పుడు నిఘా కొనసాగించేలా పెట్రోలింగ్‌ వాహనాలను ప్రవేశపెట్టారు.

హైదరాబాద్ శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు పెట్రోలింగ్‌ కోసం 4 పోలీస్‌ వాహనాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ గురువారం ప్రారంభించారు. నాలుగు పెట్రోలింగ్‌ వాహనాలతో శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ మార్గంలో 24 గంటల గస్తీ ఉంటుందని తెలిపారు.

ఇంకా హైవేపై ప్రమాదాలు జరిగితే…వెంటనే స్పందించేందుకు ఇవి ఉపయోగపడుతాయని తెలిపారు. గాయపడిన వారిని త్వరగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అవకాశముందన్నారు. హైవే పెట్రోలింగ్‌ నిర్వహించే గస్తీ టీంలకు కార్పోరేట్‌ ఆస్పత్రిలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. హైవేపై ప్రమాదాలు ఆరికట్టే ఉద్దేశంతోనే ఈ వాహనాలు ప్రవేశపెట్టామన్నారు.
 
ఎవరికి ఇబ్బందులు కలిగినా వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి సీపీ సజ్జనార్‌ చేశారు. త్వరలోనే బాలానగర్‌, మొయినాబాద్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ వాహానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.