నా కొడుకు ముఖం చూపించి చంపేసి వుంటే సంతోషపడేవాడిని: 'దిశ' నిందితుడు తండ్రి

Accused
ఐవీఆర్| Last Modified శనివారం, 7 డిశెంబరు 2019 (19:12 IST)
దిశపై అత్యాచారం, ఆపై హత్యపై దేశంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు దిశ నిందితులను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని ఘటనా స్థలంలో విచారణ చేస్తున్న సమయంలో నిందితులు తిరగబటంతో ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మిఠాయిలు పంచుకుని బాణాసంచా కాల్చారు.

మరి నిందితుల కుటుంబ సభ్యులు మాటేంటి? వాళ్లేమన్నారు అనేది చూస్తే, దిశ హత్య కేసులో నలుగురు నిందితుల్లో జొల్లు అనే నిందితుడు తండ్రి ఎన్ కౌంటర్ పైన వ్యాఖ్యానించారు. తన కొడుకుని చంపేయడంపై తనకు అభ్యంతరం లేదనీ, అలాగే ఉరి తీసినా తనేమీ బాధపడనని కేసు గురించి తెలిసినప్పుడే చెప్పానన్నారు.

ఐతే తన కుమారుడు శివ ముఖాన్ని ఒక్కసారి చూపించి, అతడితో నాలుగు ముక్కలు మాట్లాడే అవకాశం తనకు కల్పిస్తే సంతోషపడేవాడనని అన్నారు. అతడి ముఖం చూసిన తర్వాత పోలీసులు చంపేసి వుంటే ఆనందపడేవాడినని వెల్లడించారు. తన కుమారుడిని పోలీసులు కావాలనే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై మరింత చదవండి :