శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (12:16 IST)

శ్రీశైలం ప్రధాన గోపురంపై డ్రోన్‌.. గోపురం చుట్టూ తిరుగుతూ..

srisailam temple
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ప్రధాన గోపురంపై డ్రోన్‌ కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. లైటింగ్ ఉన్న డ్రోన్ గోపురం చుట్టూ తిరుగుతున్నట్లు ఆలయ సిబ్బంది గమనించారు. 
 
వారు వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. డ్రోన్‌ను కిందకు దించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించినా కుదరలేదు. 
 
కాటేజీలపైకి ఎక్కి ఎవరైనా డ్రోన్‌ను నడిపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కొంత సేపు గాలించి, డ్రోన్ ఎగిరిపోయింది. కానీ అధికారులు దానిని గుర్తించలేకపోయారు.