బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: సోమవారం, 24 జులై 2017 (19:13 IST)

డ్రగ్స్ కేసులో త్వరలో ఇద్దరు హీరోల అరెస్టు తప్పదా...?

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా ప్రస్తుతం హీరో, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకోవడమే హాట్ టాపిక్ మారుతోంది. అయితే డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసేసుకుంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా ప్రస్తుతం హీరో, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకోవడమే హాట్ టాపిక్ మారుతోంది. అయితే డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసేసుకుంది. ఇప్పటికే సినీ నటుడు తరుణ్ సిట్ అధికారుల విచారణకు హాజరైతే మరో నటుడు నవదీప్ హాజరయ్యారు. అయితే డ్రగ్స్ కీలక సూత్రధారి కెల్విన్‌తో ఇద్దరు హీరోలకు డైరెక్టుగా సంబంధాలున్నట్లు సమాచారం.
 
తరుణ్‌‌ను 12 గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు ఆయన నుంచి కొంత సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పబ్‌కు బినామీగా వున్నాడన్న ఆరోపణలున్న తరుణ్‌ను లోతుగా ప్రశ్నించింది సిట్. ఇక నవదీప్ అయితే తాను తీసుకోవడమే కాకుండా తన స్నేహితులకు డ్రగ్స్ అలవాటు చేసినట్లు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయట. డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్ సేవించినా చట్టప్రకారం నేరమే కాబట్టి మరిన్ని ఆధారాలతో ఇద్దరు హీరోలను అరెస్టు చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.