బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: సోమవారం, 24 జులై 2017 (15:09 IST)

షాక్.. విజయవాడ అమ్మాయితో కలిసి ఓ నైజీరియన్ ఏం చేస్తున్నారంటే...

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్థాయిని మించి విస్తరించిపోయిందా అంటే అవుననే సమాధానం వ్యక్తమవుతుంది. తాజాగా మరో డ్రగ్స్ ముఠాను హైదరాబాదులోని నేరేడ్‌మెట్లో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరానికి చెందిన ఓ అమ్మాయితో కలిసి ఓ నైజీరియన్ డ్రగ్స్ దందాను సాగిస్తున

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్థాయిని మించి విస్తరించిపోయిందా అంటే అవుననే సమాధానం వ్యక్తమవుతుంది. తాజాగా మరో డ్రగ్స్ ముఠాను హైదరాబాదులోని నేరేడ్‌మెట్లో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరానికి చెందిన ఓ అమ్మాయితో కలిసి ఓ నైజీరియన్ డ్రగ్స్ దందాను సాగిస్తున్నట్లు పక్కాగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. 
 
పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వారి వద్ద వివిధ రకాల మాదక ద్రవ్యాలతో పాటు రూ. 2.50 లక్షల నగదు లభ్యమైంది. విశేషమేమిటంటే... వీరితో పాటు నైజీరియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వుండటం. మొత్తమ్మీద నైజీరియా నుంచి డ్రగ్స్ నేరుగా హైదరాబాద్ నగరానికి వాలిపోతున్నట్లు తేటతెల్లమవుతోంది.