1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (13:01 IST)

కాంక్రీట్ మిక్సర్‌‌ను శుభ్రం చేస్తుంటే.. స్విచ్ఛాన్ చేశాడు.. ఇద్దరు యువకులు?

concrete mixer machine
concrete mixer machine
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నార్సింగిలోని ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్‌లో ఇద్దరు యువకులు కాంక్రీట్ మిక్సర్‌ను శుభ్రం చేస్తుండగా.. ఆపరేటర్ గమనించకుండా ప్రమాదవశాత్తు మిషన్‌ ఆన్ చేయడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 
 
పుష్పల్ గూడలో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన రెడిమిక్స్ ప్లాంట్‌లో ఇద్దరు యువకులు కాంక్రీట్ మిక్సర్‌ను శుభ్రం చేస్తుండగా, ఆపరేటర్ గమనించకుండా ప్రమాదవశాత్తు మిషన్ ఆన్ చేయడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
 
ప్లాంట్ నిర్వాహకుడి అదుపుతప్పి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలకు సమాచారం అందించడంతో తోటి కార్మికులు తమ నిర్మాణ సంస్థ వద్దకు వచ్చి నిరసనకు దిగారు. ప్లాంట్ నిర్వాహకులు, నిర్మాణ సంస్థపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. 
 
సుశీల్ ముర్ము కుటుంబ సభ్యుడు మజాహి ముర్ము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పుష్పల్ గూడలోని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ రెడి మిక్స్ ప్లాంట్‌లో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా అధ్యక్షుడు పర్వతాలు, జిల్లా కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. 
 
25 లక్షల పరిహారం ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్లాంట్ నిర్వాహకుడిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.