ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 మే 2022 (20:46 IST)

కేసీఆర్ పంటి కింద రాయిలా తీన్మార్ మల్లన్నా? అరెస్ట్.. ఎందుకని?

teenmar mallanna
తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్ పంటి కింద రాయిలా మారుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కారణం... ప్రభుత్వం భూసేకరణకు విడుదల చేసిన జీవో 80ఏను రద్దు చేయాలని హనుమకొండ జిల్లా అరెపల్లిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా తీన్మార్ మల్లన్న అక్కడికి చేరుకున్నారు.

 
తీన్మార్ మల్లన్న వచ్చాడంటే... ఆయన మాటలు తూటాల్లా పేలుతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులంతా ఐక్యంగా కలిసి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసారు. తీన్నార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు.

 
ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడంపై ఆందోళనకు దిగారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.