శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (17:05 IST)

కన్న కూతురిపైనే తండ్రి లైంగిక వేధింపులు..

కన్న కూతురిపైనే ఓ తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు షీటీంను ఆశ్రయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం మల్కాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని ఒక గిరిజన తండాలో నివాసముంటున్న 15ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు కూలి పనికి వెళుతోంది. 
 
కొన్ని రోజులుగా ఆ బాలికను తండ్రే లైంగికంగా వేధించసాగాడు. దీంతో బాధితురాలు నాలుగు రోజుల క్రితం 100 నంబర్‌కు కాల్‌ చేసి షీటీంకు ఫిర్యాదు చేసింది. వారు అక్కడికి చేరుకుని బాలికను చేరదీసి మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌హోంకు తరలించారు. అంతకుముందు మెడికల్‌ టెస్టు చేయించారు. మెడికల్‌ రిపోర్ట్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.