ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (06:49 IST)

నెహ్రూ జూపార్కులో ఉమ్మి వేస్తే రూ.1000 ఫైన్

హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈనెల 6 నుంచి తెరుచుకోనుంది. లాక్ డౌన్ తో మార్చ్ 15న మూతబడ్డ జూపార్కు ను తిరిగి అక్టోబర్ 6 నుంచి తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.

సందర్శకులు మాస్క్ ధరించాలని, లేకుంటే లోపలికి అనుమతించమన్నారు. ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలన్నారు.

వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలు రాకూడదని  చెప్పారు. జూపార్కు లో ఎవరైనా ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా వేస్తామని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. మనుషులతో పాటు తమకు జూలోని జంతువంల సంరక్షణ కూడా తమకు ముఖ్యమేనని అధికారులు వివరించారు.