ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (07:54 IST)

హైదరాబాద్ కి విదేశీ ఉల్లి

ఉల్లి ధర వంద రూపాయిలు ఎప్పుడో దాటేసింది. రోజు రోజుకి ధర పెరగడమే తప్ప తగ్గడం కనిపించడం లేదు. రైతు బజారులో కి లో రూ.40కి అమ్ముతుండగా అవి ప్రజావసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతున్నాయి.

దీనికి తోడు కిలో ఉల్లి కోసం గంటల తరబడి లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి..దీంతో  ధరలను తగ్గించడానికి కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టర్కీ దేశం నుంచి 11 వేల మెట్రిక్ టన్నులు ఢిల్లీకి రానున్నాయి.

అలాగే ఈజిప్టు నుంచి 6 వేల 090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు హైదరాబాద్‌కు రానున్నాయి.  ఈజిప్టు నుంచి భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటున్న వాటిని రాష్ట్రాన్ని తెప్పిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఉల్లి దిగుమతికి కేంద్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది.

డిసెంబర్ రెండో వారనికల్లా ఉల్లిగడ్డలు సరఫరా అవుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖాధికారులు వెల్లడించారు. అలాగే ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి అవకాశాలను పరిశీలిస్తున్నది కేంద్రం. అలాగే తెలంగాణాలోనూ ఉల్లి ధరల నియంత్రించేందుకు ప్రభుత్వ చర్యలు ప్రారంభించింది.

హోల్ సేల్ వ్యాపారుల వద్ద నిల్వలపై ఆంక్షలు విధించింది.. అక్రమ నిల్వలు వెలికి తీసేందుకు దాడులను నిర్వహిస్తున్నది. ఇక కర్నూలు హోల్ సేల్ మార్కెట్ లో క్వింటాల్ ఉల్లిని రూ.11 వేలకు హోల్ సేల్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అవి బహిరంగ మార్కెట్ లో కిలో రూ. 200 కి అమ్మే పరిస్థితి కనిపిస్తున్నది.