గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (11:43 IST)

ఉగాది రోజున విషాదం: నాగర్ కర్నూల్‌ ప్రమాదంలో నలుగురు మృతి

ఉగాది పండుగ రోజున విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
 
ఈ ఘటన చారకొండ మండలం తుర్కపల్లి వద్ద చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతి చెందినవారంతా నల్గొండ జిల్లా నేరేడుచెర్లకు చెందిన వారిగా గుర్తించారు.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కారులో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.