మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:16 IST)

అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు: 20 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో చూపించారు...

సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని కనిపించకుండా పోయింది. బుద్ధ నగర్‌కు చెందిన రాణి స్థానిక కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అయితే గత నెల 21వ తేదీన కాలేజీకి వెళ్లి కనిపోయించకుండా పోయింది. దీంతో ఇద్దరు యువకులు మీద అనుమానంతో తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు.
 
ఆనాటి నుంచి అది మిస్సింగ్ కేసుగానే ఉండి పోయింది. దీనితో గత రెండు రోజుల క్రితం అమ్మాయి తల్లి స్థానిక నేతల ద్వారా కేసును కాస్త గట్టిగా అడిగించారు. దీనితో పోలీసులు ట్యాంకబండ్‌లో లభించిన మృతదేహం ఆనవాళ్లు సరిపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గత నెల 23న మృతదేహం లభించగా, నిన్న వారికి చూపించారు. 
 
మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండటంతో డిఎన్ఏ టెస్టులు చేయించారు. మృతదేహం రాణిదిగా తేలింది. గత నెల 23న మృతదేహం లభిస్తే.. ఇన్ని రోజులు టైం పాస్ చేసారా అంటూ.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పీఎస్ ముందు ధర్నాకు దిగారు. తమకు అనుమానం ఉన్న ఇద్దరు యువకులను విచరించాలని పట్టుబట్టారు. దీంతో స్పాట్‌కు చేరుకున్న ఉన్నత అధికారులు వారికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. భారీ బందోబస్తూ మధ్య మృతదేహాన్ని ఇంటికి తరలించారు.