బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (15:27 IST)

పింఛనుదారులకు శుభవార్త చెప్పిన టీసీఎం కేసీఆర్ - ఖాతాలో రూ.3 లక్షలు

పింఛనుదారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది నుంచి పీఆర్సీ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 36 సమాన వాయిదాల్లో బకాయిలను చెల్లించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం జీవో నంబరు 1406ను రిలీజ్ చేసింది. ఈ కారణంగా, 2020 నాటికి రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్ మొత్తం కూడా పెరగనుంది. 
 
ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. పింఛనుదారులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2020 నుంచి మార్చి 31వ తేదీ 2021 వరకు చెల్లిస్తామని గతంలో ప్రకటించింది. కానీ, తాజా జీవోలో మాత్రం పింఛనుతో పాటు.. గ్రాట్యుటీ బకాయిలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం వల్ల జనవరి పింఛనుతో కలుపుకుంటే ప్రతి పింఛనుదారుడికి 1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా లంభించనుంది.