శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (12:53 IST)

హైదరాబాద్ ఐటీ సిటీ: టెక్కీలపై క్యాబ్‌లో లైంగిక వేధింపులు.. 12 గంటల వ్యవధిలో..?

హైదరాబాద్ ఐటీ సిటీ అనే సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో మహిళలపై అఘాయిత్యాలు తగ్గించేందుకు షీ టీమ్స్‌ను నియమంచినా.. లాభం లేకపోయింది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో 12 గంటల వ్యవధిలో రెండ

హైదరాబాద్ ఐటీ సిటీ అనే సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో మహిళలపై అఘాయిత్యాలు తగ్గించేందుకు షీ టీమ్స్‌ను నియమంచినా.. లాభం లేకపోయింది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో 12 గంటల వ్యవధిలో రెండు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన సెక్యూరిటీ సూపర్ వైజరే లైంగికవేధింపులకు దిగారు.
 
వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళాఉద్యోగి(31) అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన షిఫ్ట్ అయ్యాక అల్వాల్‌ ఉన్న ఇంటికివెళ్లేందుకు సిద్ధమైంది. ఆమె కోసం క్యాబ్ కేటాయించారు. ఆమెకు సెక్యూరిటీగా సూపర్ వైజర్ వేణుగోపాల్ క్యాబ్ ఎక్కాడు. కొంతదూరం అయ్యాక వెనుక సీటుకు మారిన వేణుగోపాల్ మహిళా ఉద్యోగిపై అసభ్యంగా చేతులు వేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 
 
డ్రైవర్‌‌ను సాయం అడిగినా ఆయన పట్టించుకోకపోవడంతో ఎలాగోలా ఇంటికి చేరింది.  ఈ విషయాన్ని ఆ మహిళా ఉద్యోగి తన భర్తకు చెప్పడంతో పోలీసులు సెక్యూరిటీ సూపర్ వైజర్ వేణుగోపాల్‌తోపాటు, డ్రైవర్ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
మరో ఘటనలో గూగుల్‌లో వర్క్ చేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై సీనియర్ లేబర్ ఆఫీసర్‌కు చెందిన కారు డ్రైవర్ ఉదయభాను(24) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను కారులోకి బలవంతంగా ఎక్కిచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.