శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By chj
Last Modified: శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:08 IST)

హలో బాబూ అటు కాదు ఇటు... ద్విచక్ర వాహనదారుడికి గవర్నర్ క్లాస్...

హైదరాబాద్: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ''స్వచ్చతా హై సేవా''ను శుక్రవారం నాడు దేశవ్యారప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎల

హైదరాబాద్: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ''స్వచ్చతా హై సేవా''ను శుక్రవారం నాడు దేశవ్యారప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎల్ నరసింహన్ ''స్వచ్చతా హై'' సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆయన సోమాజిగూడలోని రాజ్ భవన్ సమీపంలో పర్యటిస్తుండగా అటువైపు రాంగ్ రూట్లో ఓ ద్విచక్రవాహన చోదకుడు వేగంగా వచ్చేశాడు. దీనితో అతడిని సెక్యూరిటీ సిబ్బందితో నిలిపివేసి... ఇటువైపు రాకూడదు... మీరు రాంగ్ రూట్లో వస్తున్నారు... అలా రైట్ రూట్లో వస్తే మీకే కాదు... మిగిలినవారికి కూడా మంచిదంటూ అతడిని సరైన మార్గంలో పెట్టారు గవర్నర్. రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆ వ్యక్తితో తెలియజేశారు.