శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (11:24 IST)

16 నుంచి తెలంగాణాలో ఒక్కపూట బడులు

ఈ నెల 16వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిగంటలుగా నిర్ణయించినట్టు సమాచారం. 
 
ఇక మే 20వ తేదీన 10వ తరగతులు ముగియనున్నాయి. అంటే అదే రోజు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి రోజు. కొత్త విద్యా సంవత్సరం వచ్చే యేడాది జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అంటే ఈ యేడాది వేసవి సెలవులు జూన్ 11వ తేదీ వరకు ఇవ్వనున్నారు.