1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (18:51 IST)

నరేంద్ర మోడీ చేస్తే కరెక్ట్.. మేం చేస్తే తప్పా..?: హరీష్ రావు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేస్తే కరెక్ట్.. మేం చేస్తే తప్పా అని తెలంగాణ మంత్రి హరీష్ రావు అని నిలదీశారు. నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో పథకాల్లో మార్పులు చేశారని హరీష్ రావు చెప్పారు. ప్లానింగ్ కమిషన్‌ను పక్కనబెట్టి నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారని... మరింత బెటర్‌గా ఉండాలనే కోణంలోనే ఈ మార్పులు చేసి ఉంటారని చెప్పారు.
 
తెలంగాణ ప్రభుత్వం కూడా మరింత బాగా ఉండాలనే ఆలోచనతోనే ప్రాజెక్టుల డిజైన్లను మార్చాలని నిర్ణయించిందని... మరి దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకే తెలంగాణలో కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాల కావడమే కారణమన్నారు.