1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (16:35 IST)

ఔట్‌లుక్ పత్రికకు స్మిత సబర్వాల్ నోటీసులు: ఆపై పరువునష్టం దావా

తెలంగాణ సీఎంవో అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ ఔట్‌లుక్ పత్రికపై మండిపడ్డారు. అంతేగాకుండా ఆ పత్రికకు లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆమె సహకరించారని.. దానిని గుర్తించిన తెలంగాణ సీఎం జూనియర్ అధికారిణి అయినప్పటికీ.. ఆమెకు కీలకమైన సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్థాయి కల్పించారని ఔట్‌లుక్ పత్రిక తన కథనంలో పేర్కొంది.
 
ఈ కథనం ద్వారా తన పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ స్మిత సబర్వాల్ నోటీసులు పంపారు. ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ.. ఐదు పేజీల లీగల్ నోటీసులను తన న్యాయవాది ద్వారా ఆమె ఔట్‌లుక్‌కు పంపారు. ఆ పత్రిక నుంచి వివరణ వచ్చిన తర్వాత.. పరువునష్టం దావా వేయనున్నట్లు సబర్వాల్ న్యాయవాది తెలిపారు.