శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 3 జులై 2020 (20:00 IST)

పొరుగింటిలోకి పాము వచ్చిందని సాయం చేయబోతే...(Video)

మరొకరికి సహాయం చేయబోయి పాము కాటుతో ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి లోని విజయ్ నగర్ కాలనీకి చెందిన దుర్గయ్య తన పొరుగు ఇంట్లోకి పాము వచ్చిందని తెలిసి వారి సాయం చేద్దామని వెళ్లాడు.
 
మరో నలుగురుతో కలిసి వల వేసి పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకి గురి అయ్యాడు. పాము కరిచిందని పక్కనే వున్న ఓ వ్యక్తి తెలుసుకుని హుటాహుటిన అతడిని ఆసుపత్రి తీసుకు వెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు.
 
దుర్గయ్యకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.