మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జులై 2022 (11:25 IST)

తెలంగాణలో భారీ వర్షాలు: నిండిపోయిన మూసీ..రైళ్లు రద్దు

floods
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏక‌ధాటి వాన‌ల‌తో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండ‌లా తొణికిస‌లాడుతున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడపడినా వరద నీరు నిండిపోయింది. మూసీ నది నిండిపోయింది. నిజామాబాద్-కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి. 
 
నిజామాబాద్ జిల్లాలో అత్య‌ధికంగా 98 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మ‌రో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.
 
ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. నిర్మ‌ల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. గుండెగావ్ వ‌ద్ద పాల్సిక‌ర్ రంగ‌రావు ప్రాజెక్టులోకి బ్యాక్ వాట‌ర్ చేరింది. దీంతో ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. 
 
భైంసా గ‌డ్డెన్న వాగు ప్రాజెక్టులోకి 9,100 క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చి చేరుతోంది. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఉద‌యం నుంచి వాన జోరుగా కురుస్తోంది. ఉట్నూర్, ఇంద్ర‌వెల్లి, నార్నూర్ మండ‌లాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. నిర్మ‌ల్ జిల్లాలో ఎడ‌తెగ‌ని వ‌ర్షాల‌తో స్వ‌ర్ణ ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది.