మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (11:27 IST)

హైదరాబాద్‌లో ఆకాశానికి చిల్లు.. కుండపోతగా వర్షం

హైదరాబాద్ నగరంలో ఆకాశానికి చిల్లుపడినట్టుగా వర్షం ధారగా కురుస్తోంది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన వాన అర్థరాత్రి దాటేవరకు ఏకాధాటిగా కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 
 
ఈ ఒక్కరోజే నాగోల్‌ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.1 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.
 
అలాగే, రామంతాపూర్‌లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్‌లో 15.6, ఎల్బీనగర్‌లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్‌ మారుతినగర్‌లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వాన నమోదయ్యింది. అదేవిధంగా దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది.