శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 6 జూన్ 2017 (04:15 IST)

అయ్యో వాతావరణ శాఖా.. ఈ అంచనాకూడా తప్పేనా.. హైదరాబాద్‌లో వర్షం వర్షం

బుధవారం నుంచి ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించిం కొద్ది గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ అంచనా తప్పింది. మంగళవారం వేకువజామున 3.40 గంటలకు హైదరాబాద్‌లో భారీ వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో హోరుమని

వాతావరణశాఖపై తొలినుంచి అపప్రథ కొనసాగుతూనే ఉంది. వర్షం కురుస్తుందని అది చెప్పిన చోట వర్షం కురవదని, వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పిన చోట వర్షం దంచి కొడుతుందని జనం జోకులమీద జోకులు వేసుకుంటూనే ఉంటారు. అయినా సరే అది కిమ్మనకుండూ తన పని చేసుకుంటూనే ఉంటుంది. ఈ సారి కూడా దానికి చేదు అనుభవమే ఎదురైంది. బుధవారం నుంచి ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించి కొద్ది గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ అంచనా తప్పింది. మంగళవారం వేకువజామున 3.40 గంటలకు హైదరాబాద్‌లో భారీ వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో హోరుమని వర్షం ధారలుగా కురుస్తోంది. 

 
వాతావరణ శాఖ  బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మొదలవుతాయని చెబితే 24 గంటల ముందే అంటే మంగళవారం తొలి ఘడియల్లోనే వర్షం విరుచుకుపడటం గమనార్హం. 
 
క్యుములోనింబస్‌ మేఘాలు భూ ఉపరితలానికి సుమారు ఏడు కిలోమీటర్ల పైన అప్పటికప్పుడు భారీగా ఏర్పడుతాయని, ఇతర మేఘాల కంటే ఇవి భిన్నంగా ఒక్కసారిగా అధిక వర్షపాతాన్ని ఇస్తాయని వాతావరణ శాఖ ముందే చెప్పింది కాబట్టి ఆ ప్రకారంగానే హైదరాబాద్ నగరంపై ఆ మేఘాలు కాస్త ముందుగానే ఆవరించినట్లు ఉంది. 
 
గాలి కూడా ఆడకుండా కారుమేఘాలు కమ్ముకుని ఉన్నందున నగరంలో రాత్రంతా వర్షం కురుస్తుందనిపిస్తోంది. ఏదేతైనేమి.. ఉక్కపోతతో అల్లాడుతున్న నగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇదే క్యుములోనింబస్ వర్షాలు పల్లెల్లో కురిస్తే రాత్రికి రాత్రే ఊరి చెరువులు ముప్పావు భాగం నిండిపోతాయి. వానమ్మా వానమ్మా రావమ్మా అని పాట ఊరికే పుట్టలేదు కదా.