సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (11:35 IST)

తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలి..

Rains
నైరుతి రుతుపవనాల ప్రభావంతో శని,ఆదివారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయ్యింది. 
 
శుక్రవారం రాత్రి హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. 
 
ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.