మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:11 IST)

మేడారానికి హెలికాఫ్టర్‌ సర్వీసు: శ్రీనివాస్​ గౌడ్​

హైదరాబాద్​ నుంచి మేడారం వెళ్లేందుకు హెలికాఫ్టర్‌ సర్వీసుకు ప్రయత్నిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం జాతరకు ప్రత్యేక బస్సును ప్రారంభించారు.

మేడారం వెళ్లేందుకు నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ తెలిపారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం జాతరకు ప్రత్యేక బస్సును ప్రారంభించారు.

రోజూ ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి మేడారానికి బయల్దేరుతుందని చెప్పారు. ఏసీ బస్సులో పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200... నాన్‌ ఏసీ అయితే పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800 చొప్పున ఛార్జీలు ఉంటాయన్నారు.

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బస్సులు పెంచుతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి మేడారానికి హెలికాఫ్టర్‌ సర్వీసుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
 
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఈ నెల 4 నుంచి 8 వరకు రెండు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

ఈ నెల 4 నుంచి 8 వరకు రెండు ప్రత్యేక రైళ్లు మేడారానికి అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. సిర్పూర్‌ కాగజ్ నగర్ నుంచి ఖమ్మంకు ఒక రైలు తిరగనుండగా... వరంగల్ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లి వచ్చేందుకు మరో రైలు అందుబాటులో ఉండనుంది. 12 బోగీలతో నడిచే ఈ ప్రత్యేక రైళ్లు 5 రోజుల పాటు మేడారం జాతరకు వెళ్లే వారికి అందుబాటులో ఉండనున్నాయి.
 
డ్రోన్​ ద్వారా మేడారం జాతర, భద్రతా ఏర్పాట్ల పరిశీలన
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఈ నెల 5 నుంచి జరగనున్న మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పోలీసు శాఖ డ్రోన్ల సహాయంతో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఈ నెల 5 నుంచి జరగనున్న మేడారం మహా జాతరకు ఇప్పటికే భక్తులు దర్శనానికి పోటెత్తారు. రోజురోజుకు పెరుగుతున్న భక్త జన సందోహానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

జాతరకు నెలరోజుల ముందు నుంచే వివిధ రాష్ట్రాల వ్యాపారవేత్తలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. భద్రత దృష్ట్యా పోలీసులు డ్రోన్​ ద్వారా జాతర పరిసరాలను పరిశీలిస్తున్నారు. జాతర పరిసరాల్లోని సమ్మక్క సారలమ్మ దేవాలయం, రహదారులు, వాహనాలు, గుడారాలు, జంపన్నవాగు తదితర ప్రాంతాలు అబ్బురపరుస్తున్నాయి.