శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (12:40 IST)

ఎమ్మెల్యే తమ్ముడి పేరుతో జూ ఆర్టిస్ట్‌కు టోకరా!!

తాను జూబ్లీహిల్స్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ తమ్ముడినని చెప్పి ఒక మహిళా జూనియర్ ఆర్టిస్టును మోసం చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి మాగంటి గోపీనాథ్ కార్యాలయం వద్ద తిరుగుతూ, తాను ఎమ్మెల్యే సోదరుడినని చెప్పుకుంటూ అందరినీ నమ్మించాడు. 
 
ఈ క్రమంలో శ్రీకృష్ణనగర్‌లో ఉండే లక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం పెంచుకున్నాడు. ఎమ్మెల్యేతో చెప్పి సినిమా అవకాశాలు ఇప్పించాలని లక్ష్మీ కోరింది. ఈ క్రమంలో ఆమె నుంచి రూ.40 వేలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆమె మాగంటి కార్యాలయం వద్ద వాకబు చేసింది. తనకు తమ్ముడెవరూ లేరని ఎమ్మెల్యే చెప్పడంతో తాను మోసపోయినట్టు గ్రహించింది. ఎమ్మెల్యే సూచనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.