సారీ.. మమ్మీ... అంకుల్‌తో వెళ్లిపోతున్నా... ఆయన్ను వదిలివుండలేను..
హైదరాబాద్ నగరంలో కుంట్లూర్‌కు చెందిన బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 18వ తేది అదే గ్రామానికి చెందిన ఓ రియల్ వ్యాపారి వెంట వెళుతున్నట్లు ఒక ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వెళ్లింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ రోజే హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుంట్లూర్‌లో నివాసం ఉండే 18 యేళ్ల బాలిక హయత్‌నగర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పి. యాదయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతని కారులో ఎక్కి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతవరకు తిరిగి ఇంటికి రాక పోవడంతో భయమేస్తోందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఆచూకీ కోసం ప్రత్యేక సిబ్బందిని వివిధ ప్రాంతాలకు పంపినట్లు సీఐ సురేందర్ తెలిపారు.
కాగా, ఆ అమ్మాయి రాసిన లేఖలో.. ఆ అంకుల్‌ను వదిలి వుండలేనని, అతనితో తాను సంతోషంగా ఉంటానని తనకు అనిపిస్తుదని పేర్కొంది. పైగా, తామిద్దరం చాలా దగ్గర అయ్యాం, ఎంతలా అంటే... నేను ఇపుడు గర్భందాల్చివున్నాను అని పేర్కొంది. ఇపుడు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. అందుకే అంకుల్‌తో కలిసి వెళ్లిపోతున్నా. మా యిద్దర్ని అర్థం చేసుకో. సారీ మమ్మీ... ప్లీజ్ అర్థం చేసుకో అంటూ ఓ లేఖ రాసిపెట్టింది.