సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (14:25 IST)

మైనర్ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని.. వ్యభిచార కూపంలోకి దించారు..

మైనర్ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి.. ఆపై ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిన వ్యభిచార ముఠా గుట్టును బాలాపుర్​పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్​రాయల్​కాలనీలోని వ్యభిచార గృహంపై బాలాపూర్​పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. వ్యభిచార కూపం నుంచి 17 సంవత్సరాల మైనర్​బాలికకు విముక్తి కలిగించారు. 
 
వ్యభిచార ముఠాలోని ముగ్గురు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకుని బాలాపూర్​పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2420 నగదుతో పాటు మూడు సెల్​ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
లాపూర్​రాయల్​కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్​అబూబకర్ భార్యభర్తలు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో రెహానా బేగం, సయ్యద్​అబూబాకర్ తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేయాలని నిర్ణయించుకున్నారు. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో.. పక్కింటికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలంటూ రెహానాబేగంను కోరింది. ఇదే అదనుగా భావించి రేహానా బేగం.. ఆ మైనర్​బాలికకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపింది.
 
అయితే పోలీసులు రెక్కీ నిర్వహించి రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకొని వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మైనర్​బాలికను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెహానా బేగం, సయ్యద్​ అబూబకర్, సల్మాబేగం, విటుడు మహ్మద్​ అష్యులను బాలాపూర్​పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.