శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (20:07 IST)

బండ్లగూడలో కార్డాన్ సెర్చ్ : 50 మంది నైజీరియన్ల అరెస్టు

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్ బండ్లగూడలో నగర పోలీసులు కార్డాన్ సెర్చ్ చేపట్టారు. దాదాపు 1500 మంది పోలీసులు ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు. బండ్లగూడ, రాధా నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 200 గృహాల్లో ఈ సోదాలు చేశారు.
 
ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తించారు. అయితే, తామంతా విద్యార్థులమని తమను అక్రమంగా అరెస్టు చేయడం భావ్యం కాదని పేర్కొంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.